కువైట్ లో స్కూల్స్ పునః ప్రారంభం.. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు..!
- September 16, 2024
కువైట్: 500,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులు, 105,000 మంది టీచర్లు, సిబ్బంది తిరిగే స్కూళ్లకు హాజరు కానున్నారు. ఈ మేరకు సన్నాహాలను పూర్తి చేసినట్టు విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. అకడమిక్ క్యాలెండర్ ఆధారంగా అరబిక్ పాఠశాలల్లో మొదటి గ్రేడ్ సెప్టెంబర్ 16న ప్రారంభమవుతుంది. అయితే ప్రాథమిక, మధ్య మరియు ఉన్నత పాఠశాలల విద్యార్థులు సెప్టెంబర్ 17న, కిండర్ గార్టెన్ సెప్టెంబర్ 18న ప్రారంభం కానున్నాయి. GPS ట్రాకింగ్ సిస్టమ్‌లతో కూడిన పెద్ద సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో భాగంగా విద్య మరియు అంతర్గత మంత్రిత్వ శాఖలు 2024-25 విద్యా సంవత్సరానికి ముందు రహదారి-అవగాహన మీడియా ప్రచారాన్ని ప్రారంభించాయి. ఈ ప్రచారం సెంటర్ ఫర్ గవర్నమెంట్ కమ్యూనికేషన్ (CGC), సమాచార మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహిస్తున్నారు. రహదారులపై రద్దీని తగ్గించడం, ట్రాఫిక్ ప్రవాహాన్ని సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







