డిస్కౌంట్ ఆఫర్‌లు..44 సంస్థలకు జరిమానాలు..!
- September 17, 2024
రియాద్: సౌదీ వాణిజ్య మంత్రిత్వ శాఖ నుండి లైసెన్స్ పొందకుండా పోటీలు, డిస్కౌంట్ ఆఫర్లను నిర్వహించినందుకు 44 వాణిజ్య సంస్థలపై శిక్షార్హమైన చర్యలు తీసుకున్నారు. యాంటీ-కమర్షియల్ ఫ్రాడ్ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా వారిపై చర్యలు తీసుకోవడానికి వీలుగా పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు సూచించారు. పోటీలు లేదా డిస్కౌంట్ ఆఫర్‌లను నిర్వహించాలనుకునే వాణిజ్య సంస్థలు, ఆన్‌లైన్ స్టోర్‌లు తప్పనిసరిగా మంత్రిత్వ శాఖ నుండి లైసెన్స్ పొందాలని మంత్రిత్వ శాఖ గతంలో ఆదేశించింది. లైసెన్స్ లేకుండా పోటీలు మరియు డిస్కౌంట్ ఆఫర్‌లను నిర్వహించడం అనేది యాంటీ-కమర్షియల్ ఫ్రాడ్ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొంది.
యాంటీ-కమర్షియల్ ఫ్రాడ్ చట్టం ప్రకారం.. చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించే ఎవరైనా గరిష్టంగా మూడు సంవత్సరాల జైలు శిక్ష, మరియు గరిష్టంగా SR1 మిలియన్ జరిమానా వరకు విధించనున్నారు.
తాజా వార్తలు
- రైళ్లలో అదనపు లగేజీ పై ఛార్జీలు
- విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..
- దుబాయ్లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- హ్యాకింగ్, ఆర్థిక మోసాల దారితీసే నకిలీ QR కోడ్లు..!!
- కువైట్ లో పాదచారుల భద్రతకు ప్రతిపాదనలు..!!
- ఖతార్ లోఆరోగ్య కేంద్రాల పనివేళలల్లో మార్పులు..!!
- సౌదీలో కార్మికుల పై ప్రవాస రుసుము రద్దు..!!
- ఒమన్, భారత్ మధ్య కీలక అవగాహన ఒప్పందాలు..!!
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ







