దేవర’ ఆ చివరి 40 నిముషాలు వేరే లెవల్.!
- September 17, 2024
మరి కొద్ది రోజుల్లోనే ‘దేవర’ ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషన్లు కాస్త ఊపందుకున్నాయ్. టాలీవుడ్‌తో పాటూ, బాలీవుడ్ ఇతర భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ కానున్న సంగతి కూడా తెలిసిందే.
దాంతో, సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ టూర్ల మీద టూర్లు వేస్తున్నారు. అయినా ఏమాత్రం బజ్ క్రియేట్ చేయలేకపోతున్నారు సినిమాపై.
లేటెస్ట్‌గా బాలీవుడ్‌లో తారక్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భాగంగా క్లైమాక్స్‌కి ముందు 40 నిముషాల సినిమా అత్యంత కీలకమని చెప్పారు. దాంతో, ఒకింత అంచనాలు పెరిగాయ్.
సెన్సార్ రిపోర్ట్ ప్రకారం యు బై ఏ సర్టిఫికెట్ అందుకుంది. 2 గంటల 57 నిముషాల 58 సెకన్లు రన్ టైమ్ ఫిక్స్ చేసుకుంది. అంటే దాదాపు 3 గంటల సినిమానే.
ఈ మధ్య 3 గంటల రన్ టైమ్ సినిమాలకు బాగానే కలిసొచ్చింది. ‘కల్కి’, ‘సరిపోదా శనివారం’ సినిమాల రన్ టైమ్ 3 గంటలు (దాదాపు). అయినా సినిమాలో కంటెంట్ వుంటే అంత సమయాన్ని బోర్ ఫీల్ కారు ఆడియన్స్. ఒకవేళ సినిమాలో విషయం లేకుంటే అదే మొదట సినిమా ఫెయిల్యూర్‌కి మైనస్ అయ్యే పాయింట్. ‘దేవర’ విషయంలో ఏం జరుగుతుందో చూడాలిక.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







