"మై టాక్సీఇండియా " తో స్పైస్ జెట్ ఒప్పందం..
- June 19, 2016
విమాన ప్రయాణికులు ఎయిర్ పోర్టుకు చేరుకోగానే ట్యాక్సీ కోసం వెతుకులాడుతుంటారు. అలా వెతికే అవసరం లేకుండా విమాన టిక్కెట్ కొనుగోలు చేసినప్పుడే, ట్యాక్సీ ని కూడా బుక్ చేసుకునే సదుపాయం కల్పించనుంది స్పైస్ జెట్. ఈ వినూత్నమైన ఆఫర్ ను విమాన ప్రయాణికుల ముందుకు స్పైస్ జెట్ త్వరలోనే ప్రవేశపెట్టబోతోంది. దీనికోసం క్యాబ్ అగ్రిగేటర్ "మై టాక్సీఇండియా (ఎంటీఐ)" తో ఒప్పందం కుదుర్చుకుంది. స్పైస్ జెట్ మొత్తం దేశంలో 41 గమ్యస్థానాలకు,300 డైలీ విమానాలను నడుపుతోంది. దానిలో ఆరు ఇంటర్నరేషనల్ విమానాలు ఉన్నాయి. టైర్ 2, టైర్ 3 సిటీల నుంచి కస్టమర్లను అధికంగా ఆకట్టుకోవడానికి, రెవెన్యూలను పెంచుకోవడానికి స్పైస్ జెట్ ఈ ఆఫర్ ను ప్రయాణికుల ముందుకు తీసుకురాబోతుంది.ఈ ఆఫర్ తో ప్రయాణికులు గమ్యస్థానానికి చేరుకోగానే ట్యాక్సీ అందుబాటులో ఉంటుంది. అప్పుడు వెతుకునే అవసరం లేకుండానే ప్రయాణికులు ప్రశాంతంగా గమ్యస్థానాలకు చేరిపోయే వీలుంటుంది. ట్యాక్సీ అవసరమైన వారు టిక్కెట్ కొనుగోలు సమయంలోనే ట్యాక్సీని బుక్ చేసుకోవచ్చని స్పైస్ జెట్ ప్రెసిడెంట్ అమిత్ శ్రీవాత్సవ్ తెలిపారు. ఈ ఆఫర్ ను త్వరలోనే ప్రవేశపెడతామన్నారు. టైర్ 2, టైర్ 3 సిటీల్లో మధ్యతరగతి వినియోగదారులను ఎక్కువగా ఆకట్టుకోవడానికి ఈ సర్వీసు ఉపయోగపడుతుందని శ్రీవాత్సవ్ పేర్కొన్నారు. ఎంటీఐ ట్యాక్సీ అగ్రిగేటర్ గా 2013నుంచి తన సేవలు అందిస్తోంది. 119 సిటీల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. 454 పైగా క్యాబ్ ఆపనేటర్లను ఈ సంస్థ కలిగి ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







