ఈ రమదాన్ కాలంలో ఇప్పటివరకు 8 మంది ట్రాఫిక్ ప్రమాదాలలో మరణించారు
- June 20, 2016
ఈ నెల జూన్ 6 న రమదాన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ట్రాఫిక్ సంఘటనలలో ఎనిమిది మంది మరణించారు అలాగే 12 మంది గాయపడినట్లు దుబాయ్ పోలీస్ ఆదివారం తెలిపింది. దుబాయ్ ట్రాఫిక్ పోలీస్ డైరెక్టర్ కల్నల్ సైఫ్ ముహైర్ అల్ మజిఒర్ మాట్లాడుతూ ఈ నెల జూన్ 6 వ తేది నుంచి 16 వ తేది మధ్య కాలంలో 26 ట్రాఫిక్ సంఘటనలు జరగగా ఇందులో 40 వాహనాల జోక్యం ఉందని తెలిపారు.మొత్తం 12 మంది ఈ ప్రమాదాలలో గాయపడగా, వారిలో ఒకరు తీవ్రంగా గాయపడి ఉండగా మరో ఆరుగురు ఒక మోస్తరుగా గాయాల పాలయ్యారు. మరో ఐదుగురు చిన్న గాయాలతో బయటపడ్డారు.26 ప్రమాదాలలో 17 కేసులలో వాహనాలు ఎదురెదురుగా దూసుకెళ్ళడం ఉన్నాయి, మరో ఐదుగురు ప్రమాదాలలో వాహనాలు మీద నుండి వెళ్ళడం వలన ప్రమాదాలు జరగ్గా , మరియు నాలుగు ప్రమాదాలు వాహనాన్ని అతిగా మలుపు తిప్పడం వలన ప్రమాదాలు జరిగినట్లు తెలిపారు.
గత రామదన్ సమయంలో, దుబాయ్ పోలీసులు నమోదు చేసిన ప్రమాద వివరాల ప్రకారం మొత్తం 201 తీవ్రమైన ప్రమాదాలు కాగా, ఇందులో 10 మంది మరణించగా మరియు 147 మంది గాయాల పాలయ్యారు. గాయపడిన 146 మందిలో 19 మందికి తీవ్రమైన గాయాలపాలయ్యారు. 35 మందికి ఒక మోస్తరుగా గాయాలు తగిలాయి. మిగిలిన 93 మందిగా స్వల్ప గాయాలు తగిలినట్లు వివరించారు. ఉన్నాయి. ప్రమాదాలను నివారించడానికి ప్రజలు ట్రాఫిక్ నియమాలు మరియు నిబంధనలు కట్టుబడి ఉండాలని దుబాయ్ ట్రాఫిక్ పోలీస్ డైరెక్టర్ కల్నల్ సైఫ్ ముహైర్ అల్ మజిఒర్ కోరారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







