నిధుల దుర్వినియోగం
- June 20, 2016
పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణలో, రెలిజియస్ క్లరిక్ షేక్ ఇసా కాసిమ్, పెద్ద మొత్తంలో నిధుల్ని దారి మళ్ళించారనీ, ఇందులో చాలావరకు బహ్రెయిన్‌కి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఇరాన్, ఇరాక్‌లోని సంస్థలకు పంపించారనీ తేలింది. అల్ వెఫాక్ ఇస్లామిక్ సొసైటీ స్పిరిట్యువల్ లీడర్ అయిన షేక్ ఇసా కాసిమ్, విరాళాల సేకరణకు సంబంధించిన చట్టాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. షేక్ ఇసా కాసిమ్, 10 మిలియన్ దిర్హామ్‌లు తన అక్కౌంట్లో కలిగి ఉన్నారు. విరాళాల రూపంలో వచ్చే సొమ్ముల్ని సంస్థకు మళ్ళించకుండా వాటిని, అసాంఘీక కార్యక్రమాల కోసం షేక్ ఇసా కాసిమ్ వినియోగించినట్లు తేల్చింది పబ్లిక్ ప్రాసిక్యూషన్. ఇస్లామిక్ అవేర్నెస్ సొసైటీ ద్వారా అనేక అక్రమాలకు పాల్పడుతున్నారనీ, మనీ ల్యాండరింగ్ కూడ ఇక్కడ జరిగిందని, విచారణ ఇంకా కొనసాగుతోందని చీఫ్ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ అల్ మలికి చెప్పారు. అక్రమాలకు పాల్పడేందుకోసం లైసెన్స్ లేని కార్యాలయాన్ని కూడా తెరిచి, వాటి ద్వారా డబ్బుని ఇతరులకు పంపించి, బహ్రెయిన్ వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతిస్తున్నారని విచారణలో తేలింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







