41 దేశాల్లో యూఏఈ ఛారిటీ ఇఫ్తార్
- June 20, 2016
మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ చారిటీ మరియు హుమానిటేరియన్ ఫౌండేషన్, పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలి, పేద ముస్లింల కోసం పలు దేశాల్లో చేపడుతోంది. అరబ్, అసియా, మరియు ఆఫ్రికా దేశాలతోపాటు, హైతి, అమెరికా, కెనడాల్లోనూ ఇఫ్తార్ కార్యక్రమాల్ని నిర్వహించనున్నారు. ఈ ఏడాది లబ్దిదారుల సంఖ్యను 13.3 శాతం పెంచారు. 8 మిలియన్ దిర్హామ్‌ల ఖర్చుతో 43,637 మందికి ఈ లబ్దిని చేకూర్చతలపెట్టారు. వైఎస్ ఛైర్మన్ - బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, ఛాన్సెలర్ ఇబ్రహీమ్ బౌమెల్లా మాట్లాడుతూ, ఇస్లాం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు, అలాగే పేదల్ని ఆదుకునేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. పాలస్తీనా, జోర్డాన్, సిరియా, లెబనాన్, ఈజిప్ట్, సుడాన్, మారిటానియా, సోమాలియా, దిజ్బౌతి తదితర ప్రాంతాల్లో ఇఫ్తార్ ప్రాజెక్టుల్ని నిర్వహిస్తోంది ఈ ఫౌండేషన్. ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, ఇండోనేసియా, తజకిస్తాన్, ఇండియా, జపాన్, థాయిలాండ్ తదితర ఆసియా దేశాల్లోనూ పలు ప్రాజెక్టుల్ని నిర్వహించింది. ఘనా, సెంగాయ్, ఇతియోపియా, ఉగాండా, కెన్యా తదితర 15 ఆఫ్రికా దేశాల్లోనూ ఇఫ్తార్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







