ఎమ్మెల్యే ఆదిమూలం పై కేసు ఉత్తిదే: సీనియర్ న్యాయవాది రఘు

- September 21, 2024 , by Maagulf
ఎమ్మెల్యే ఆదిమూలం పై కేసు ఉత్తిదే: సీనియర్ న్యాయవాది రఘు

విజయవాడ: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పై నమోదైన అత్యాచారం కేసుపై శుక్రవారం హైకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆదిమూలం పై ఫిర్యాదు చేసిన బాధిత మహిళ స్వయంగా కోర్టుకు వెళ్లి, అతని పై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలు, ఎఫ్ఐఆర్ లో చెప్పిన అంశాలు అవాస్తవమంటూ అఫిడవిట్ ను హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. న్యాయస్థానం కూడా బాధిత మహిళతో మాట్లాడడం జరిగింది.అనంతరం వాస్తవాలను వివరిస్తూ అఫీడవిట్ వేశానని, ఆదిమూలం పై నమోదు చేసిన కేసు తప్పు అంటూ, దానిని కొట్టేయమని న్యాయమూర్తిని వేడుకుంది.ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి ఆదిమూలం పై తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. తగిన ఉత్తర్వులు జారీ చేసే నిమిత్తం విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు.హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విఆర్కె కృపాసాగర్ శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తనను పలుమార్లు బెదిరించి అత్యాచారం చేశాడని తిరుపతి జిల్లా కేవీబీ పురం మండలానికి చెందిన బాధితురాలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆదిమూలంపై తిరుపతి తూర్పు టానా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.ఈ కేసును కొట్టేయాలంటూ ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు.శుక్రవారం రోజు జరిగిన విచారణలో ఆదిమూలం తరపు సీనియర్ న్యాయవాది చిత్తర్వు రఘు తన వాదనను వినిపిస్తూ పోలీసులు విచారణ చేయకుండా కేసు నమోదు చేశారని చెప్పారు. మూడో వ్యక్తి చొరవతో పిటిషనర్ పై ఆ మహిళా ఫిర్యాదు చేశారని అన్నాడు.

--సాయి కిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com