iPhone 16 ఫోన్ల అమ్మకాలు ప్రారంభం
- September 21, 2024
గ్లోబల్ టెక్ దిగ్గజ సంస్థ అపిల్ తన ఐ ఫోన్ 16 సిరీస్ ఫోన్ల విక్రయాలు శుక్రవారం (సెప్టెంబర్20) నుండి ప్రారంభమయ్యాయి. దీంతో కొనుగోలుదారులు యాపిల్ స్టోర్‌ల ముందు క్యూ కట్టారు. దేశ వ్యాప్తంగా ఐ ఫోన్ 16 మొబైల్ అమ్మకాలు ప్రారంభమయ్యాయని ఆపిల్ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. అయితే, భారత్ మార్కెట్‌లో ఐ ఫోన్ ప్రో సిరీస్ ఫోన్ల లభ్యతపై మాత్రం ఆపిల్ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. దేశంలో ఐ ఫోన్ ప్రో సిరీస్ ఫోన్లను తొలిసారి అసెంబ్లింగ్ చేస్తున్నా వాటి అమ్మకాల తేదీ త్వరలో ప్రకటిస్తామని అపిల్ వర్గాలు వెల్లడించాయి. ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో స్మార్ట్ ఫోన్లపై దిగుమతి సుంకం తగ్గించిన నేపథ్యంలో గత వర్షన్ ఐ ఫోన్ల కంటే ఐ ఫోన్ 16 సిరీస్ మొబైల్ ధరలు తగ్గనున్నాయి. ఐ ఫోన్ 16 ప్రో మొబైల్ ధర రూ.1,19,900లు, ఐ ఫోన్ 16 ప్రో మ్యాక్స్ మొబైల్ ధర రూ.1,44,900 నుండి ప్రారంభం అవుతుందని ఆపిల్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే ఐ ఫోన్ 16 మొబైల్, ఐ ఫోన్ 16 ప్లస్ ధరల్లో ఎటువంటి మార్పు లేదని ఆపిల్ తెలిపింది. ఐ ఫోన్ 16 మొబైల్ ను రూ.79,900లు, ఐ ఫోన్ 16 ప్లస్ మొబైల్ ను రూ.89,900లకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్‌కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం







