తిరుమల లడ్డూ కల్తీ అంశం పై టీటీడీ అత్యవసర భేటీ....
- September 21, 2024
తిరుమల: శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అత్యవసర భేటీ ఏర్పాటు చేసింది. తిరుపతి పరిపాలన భవనంలో ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. లడ్డూ అపవిత్రత నేపథ్యంలో సంప్రోక్షణపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. ప్రధాన అర్చకుడు, ఆగమ పండితులతో టీటీడీ ఈఓ శ్యామలరావు చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కాగా, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యి వాడారన్న వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా హల్‌చల్ చేస్తోంది. జాతీయ స్థాయిలో దీనిపై రచ్చ జరుగుతోంది. నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని టెస్టుల్లో తేలిందని టీటీడీ ఈఓ శ్యామలరావు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడీ విషయం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..