ప్రబాస్‌తో తలపడనున్న సైఫ్.! ఇంకోసారి.!
- September 21, 2024
‘ఆది పురుష్’ సినిమాతో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. అయితే, ఆ సినిమా రిజల్ట్ సంగతేంటో తెలిసిందే.
సో, ఆ సినిమాని డెబ్యూగా పరిగణించాల్సినా.. సైఫ్ మాత్రం మరో టాలీవుడ్ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా.. అంటున్నాడు.
అదే ‘స్పిరిట్’ మూవీ. ప్రబాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రూపొందబోయే ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.
ఈ సినిమాలో ప్రబాస్‌తో తలపడేందుకు సైఫ్ అలీఖాన్ మరోసారి విలన్ అవతారమెత్తబోతున్నాడు. ‘ఆది పురుష్’లో రావణాసురుడి పాత్ర పోషించిన సైఫ్, ఈ సినిమాలో ఓ క్రూరమైన విలన్‌గా కనిపించబోతున్నాడనీ సమాచారం.
విలన్ పాత్ర ఎంత క్రూరంగా వుంటే, హీరో పాత్ర అంతలా ఎలివేట్ అవుతుంది. అసలే హీరో పాత్రలు సందీప్ సినిమాల్లో ఏ రేంజ్లో వుంటాయో ఆయన గత చిత్రాలు చూస్తే అర్ధమవుతుంది.
అలాంటిది ప్యాన్ ఇండియా స్టార్ ప్రబాస్‌తో ఆయన తెరకెక్కించబోయే చిత్రం. అందులోనూ భారీ బడ్జెట్‌తో ప్రెస్టీజియస్‌గా రూపొందుతోన్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ఇంకా స్టార్ట్ కాకుండానే భారీగా అంచనాలున్నాయ్.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..