‘గేమ్ ఛేంజర్’ ఇకపై ప్రమోషన్లే.!
- September 21, 2024
ఇదిగో వచ్చేస్తుంది.. అదిగో వచ్చేస్తుంది.. అంటూ ‘గేమ్ ఛేంజర్’పై అంచనాలు పెంచేస్తున్నారు. కానీ, ఆ సినిమా నుంచి అప్డేట్ రావడమే కష్టమైపోతోంది.
అంతా శంకర్ మ్యాజిక్. ఏం చేస్తాం. శంకర్ సినిమాల్లో ఈ వెయిటింగ్ తప్పదు. ఓపిక వుండాలి మరి. ఇక, ‘గేమ్ ఛేంజర్’ విషయానికొస్తే.. ప్రస్తుతం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనులు వేగవంతంగా నడుస్తున్నాయట.
ఈ విషయాన్ని స్వయంగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ధృవీకరించాడు. సినిమా డిశంబర్ 20 కల్లా పక్కా రిలీజ్.. అని కూడా కన్‌ఫామ్ చేశారాయన. ఇక, సెప్టెంబర్ 20 నుంచి డిశంబర్ 20 వరకూ మూడు నెలల టైమ్ గ్యాప్ వుంది.
ఈ గ్యాప్‌లో షూటింగ్, నిర్మాణానంతర పనులు పూర్తి చేసి, సినిమాని అనుకున్న టైమ్‌కి రిలీజ్ చేసేందుకు టీమ్ కష్టపడుతోందనీ థమన్ మాటల ద్వారా అర్ధమవుతోంది.
అంతేకాదు, ఇకపై సినిమా నుంచి సర్‌ప్రైజింగ్ అప్డేట్స్ వస్తూనే వుంటాయని కూడా థమన్ చెప్పాడు. ఇంకేముంది మెగా ఫ్యాన్స్‌కి అంతకన్నా కావల్సిందేముంది. దిల్ రాజు ప్రొడక్షన్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో ఎస్.జె.సూర్య, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా, కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజా వార్తలు
- రేపు కూటమి సర్కార్ తొలి వార్షికోత్సవ సభ
- ఒమాన్‌లో 2028 నుండి 5% వ్యక్తిగత ఆదాయ పన్ను
- ముంబై విమానాశ్రయంలో భారీగా బంగారం సీజ్..
- రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలకు తెరదించిన సౌరవ్ గంగూలీ
- ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: స్థిరంగా యూఏఈ ఎయిర్ ట్రాఫిక్..సౌదీలో రెట్టింపు..!!
- సంక్షోభంలో మానవత్వం..ఇరాన్‌పై అమెరికా దాడిని ఖండించిన ప్రపంచ దేశాలు..!!
- ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ.. 3 అణు కేంద్రాలపై దాడులు..!!
- విలాయత్ బర్కాలో అగ్నిప్రమాదం..సీడీఏఏ
- ప్రపంచవ్యాప్తంగా పాస్వర్డ్లు హ్యాక్.. ఐటీ భద్రతను పెంచాలన్న కంపెనీలు..!!
- ఇరాన్‌పై ఇజ్రాయెల్ ది దురాక్రమణ..సౌదీ అరేబియా