కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుందో తెలుసా.?

- September 21, 2024 , by Maagulf
కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుందో తెలుసా.?

కొలెస్ట్రాల్ పెరిగితే ప్రమాదమే అని అందికీ తెలిసిందే. కానీ, కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది.? అనేక రకాల కారణాలు.

ఒకటి జన్యు పరంగా కొలెస్ట్రాల్ పెరగడానికి కారణాలుంటాయ్. ఫ్యామిలీలో ఎవరైనా ఊబకాయులు వుంటే.. ఆటోమెటిగ్గా తర్వాతి జనరేషన్‌కి అది సంక్రమించే అవకాశాలున్నాయ్.

అలాగే ఒత్తిడి ఓ కారణంగా పరిగణించొచ్చు. ఒత్తిడి అనేది ప్రత్యక్షంగా కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం కాకపోయినా పరోక్షంగా కారణమవుతుంది.

ఒత్తిడి పెరిగితే లైఫ్ స్టైల్ మారిపోతుంది. లైఫై స్టైల్‌లోని పలు చెడు అలవాట్లే కొలెస్ట్రాల్ పెరగడానికి కారణంగా చెబుతున్నారు.

సరైన టైమ్‌కి నిద్ర లేకపోవడం, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్.. ఇలా అనేక రకాల చెడు అలవాట్లు ఒత్తిడి కారణంగా పెరుగుతాయ్. తద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది.

కొలెస్ట్రాల్‌‌లో రెండు రకాలుంటాయ్. శరీరానికి కొంత మేర కొలెస్ట్రాల్ అవసరమే. కానీ, బ్యాడ్ కొలెస్ట్రాల్ రక్తంలో కరగదు. తద్వారా రక్త నాళాల్లో అడ్డంకులు ఏర్పడి కొన్ని సందర్భాల్లో హార్ట్ ఎటాక్ వంటి విపరీతమైన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయ్.

అందుకే లైఫ్ స్టైల్ ని ఎప్పుడూ అదుపులో వుంచుకోవాలి. లైఫ్ స్టైల్ కంట్రోల్‌లో వుంటే కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్‌లో వుంటుందని నిపుణులు చెబుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com