జింబాబ్వే ను వోడించిన భారత్

- June 20, 2016 , by Maagulf
జింబాబ్వే ను వోడించిన భారత్

జింబాబ్వేతో తొలి టీ20లో ఓటమి చవిచూసిన భారత్ రెండో టీ20లో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టును 99 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలిచింది. ఓపెనర్లే మ్యాచ్‌ను గెలిపించారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి జింబాబ్వే 99 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 13.1 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 103 పరుగులు చేసి విజయం సాధించింది. భారత బ్యాట్స్‌మెన్స్ రాహుల్ 47, మన్‌దీప్ సింగ్ 52 పరుగులు చేశారు. శరణ్ 4, బుమ్రా 3, కులకర్ణి, చాహల్ చెరొక వికెట్ తీసుకున్నారు. 31 పరుగులు చేసిన మూర్.. జింబాబ్వే తరఫున హైయెస్ట్ స్కోరర్‌.
శరణ్ 4 ఓవర్లలో కేవలం పది పరుగులే ఇవ్వగా.. బుమ్రా 11 పరుగులే ఇచ్చాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com