'2 నిమిషాల డ్రైవ్ కు 30 నిమిషాలు పడుతుంది'..ట్రాఫిక్ జామ్‌లపై నివాసితుల్లో తీవ్ర అసంతృప్తి..!!

- September 24, 2024 , by Maagulf
\'2 నిమిషాల డ్రైవ్ కు 30 నిమిషాలు పడుతుంది\'..ట్రాఫిక్ జామ్‌లపై నివాసితుల్లో తీవ్ర అసంతృప్తి..!!

యూఏఈ: దుబాయ్, షార్జాలో ట్రాఫిక్ కష్టాలు ఇబ్బందిగా మారాయా? అంటే అవుననే అనిపిస్తుంది. తమ కమ్యూనిటీ నుండి ప్రధాన రహదారిపైకి వెళ్లడానికి 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం పడుతుందని అనేక మంది నివాసితులు చెబుతున్నారు. ఒకటే ఎగ్జిట్ ఉండటమే దీనికి కారణంగా వారు పేర్కొంటున్నారు. రద్దీ లేని సమయాల్లో హైవేని చేరుకోవడానికి కేవలం 2-నిమిషాలు మాత్రమే పడుతుందన్నారు. తమకు రోజువారీ ప్రయాణం పీడకలగా మారుతుందని, రద్దీ సమయాల్లో అనేక కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అవుతుందని చెబుతున్నారు.  అనేక కమ్యూనిటీలలో నివసిస్తున్న నివాసితులు తమ రోజువారీ కష్టాలను వివరించారు. ట్రాఫిక్ జామ్ ఉదయం 6.30 గంటలకే మొదలవుతుందని టెలికాం సంస్థలో ఇంజనీర్ అయిన అహ్మద్ రిజ్వాన్ తెలిపారు. ఆయన గత 5 సంవత్సరాలుగా దుబాయ్ ప్రొడక్షన్ సిటీలో నివాసం ఉంటున్నారు. కమ్యూనిటీ నుం మెయిన్ రోడ్ వచ్చేందుకు దాదాపు 25 నిమిషాలు పడుతుందని, సాధారణ సమయంలో కేవలం 2 నిమిషాల్లో చేరుకుంటానని తెలిపారు.  “మా పరిసరాల్లో రెండు ఎగ్జిట్ లు ఉన్నాయి. నిర్మాణం కారణంగా ఒకటి మూసివేశారు. నివాసితులు అందరూ E311కి వెళ్లాలి. లేదా E311లో విలీనం కావడానికి అల్ ఫే రోడ్‌ని వెంట వెళ్లాలి. అల్ ఫే రోడ్ ఎగ్జిట్ సాధారణ సమయాల్లో కూడా రద్దీగా ఉంటుంది.  ” అని రిజ్వాన్ చెప్పాడు. కొన్ని సంవత్సరాల క్రితం, తాను కార్యాలయానికి కేవలం అరగంటలో చేరుకునేవాడినని, ఇప్పుడు చేరుకోవడానికి ఒక గంట,తిరిగి రావడానికి మరో గంట పడుతుందని రిజ్వాన్ వాపోయాడు.

దుబాయ్‌లోని ప్రభుత్వ సదుపాయంలో పనిచేస్తున్న ఈజిప్షియన్ దంతవైద్యుడు డాక్టర్ గదీర్ కూడా ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారిందన్నారు. ట్రాఫిక్ జామ్ తో నిత్యం కుస్తీ పడాల్సిన పరిస్థితి ఉందన్నారు. తాను ఎక్స్‌ప్రెస్‌వేకి చేరుకోవడానికి 30 నిమిషాలకు పైగా ట్రాఫిక్‌లో వెళుతున్నట్లు గదీర్ చెప్పారు. డాక్టర్ గదీర్ షార్జాలోని అల్ తవూన్‌లో నివసిస్తున్నారు. అల్ ఇత్తిహాద్ రోడ్‌కు వెళ్లే ఒక ఎగ్జిట్ కారణంగా నిత్యం తీవ్ర రద్దీని ఎదుర్కొంటున్నట్టు తెలిపారు.  “నేను నా పిల్లలను అల్ నహ్దా దుబాయ్‌లోని పాఠశాలకు వదిలివేయడానికి ఉదయం 6.30 గంటలకు ఇంటి నుండి బయలుదేరతాను. మేము నా నివాసం నుండి అల్ ఇత్తిహాద్ రోడ్ ప్రధాన రహదారికి చేరుకోవాలి. నేను 10 నిమిషాలు ఆలస్యమైతే హైవేకి చేరుకోవడానికి దాదాపు అరగంట పడుతుంది. బంపర్-టు-బంపర్ ట్రాఫిక్ ఉంటుంది. నేను ప్రతిరోజూ నా క్లినిక్‌కి చేరుకోవడానికి ఒక గంట కంటే ఎక్కువ సమయం వెచ్చిస్తాను” అని డాక్టర్ గదీర్ అన్నారు. అదేవిధంగా, జుమేరా విలేజ్ సర్కిల్ (JVC) నివాసితులు కూడా సమీప రహదారికి కరెంట్ యాక్సెస్ పాయింట్ల కారణంగా రోజువారీ ట్రాఫిక్ కష్టాలతో ఇబ్బందులు పడుతున్నారని ఎమిరాటీ ట్రాఫిక్, రవాణా భద్రతా నిపుణుడు డాక్టర్ ముస్తఫా అల్దా చెప్పారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com