ఉగ్రవాద దాడులను ముందుగానే పసిగట్టే సాంకేతిక విధానం
- June 20, 2016
ఫలానా ప్రాంతంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తుంటాయి. అందుకు వివిధ మార్గాల ద్వారా అనుమానితుల కదలికలను గమనిస్తూ ఉంటారు. అయితే.. ఇంటలిజెన్స్ వర్గాలతో పనిలేకుండా ఉగ్రవాదులు ఎక్కడెక్కడ దాడులకు పాల్పడేందుకు వ్యూహం పన్నుతున్నారో ముందుగానే పసిగట్టే సాంకేతిక విధానాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు.
అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న మియామీ విశ్వవిద్యాలయానికి చెందిన డా.నెయిల్ జాన్సన్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఉగ్రవాదులు వ్యూహరచనకు.. సమాచార మార్పిడికి సోషల్‌మీడియానే ఎక్కువగా వినియోగిస్తున్నట్లు ఇటీవల జరిగిన చాలా దాడుల్లో బయటపడింది.
ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలకు ప్రత్యేకంగా సైబర్ విభాగాలు కూడా ఉన్నట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వందల వెబ్సైట్లలో పోస్టులను విశ్లేషిస్తూ ఎక్కడ దాడులకు పాల్పడేందుకు వ్యూహం పన్నుతున్నారో ముందస్తుగా పసిగట్టేలా అల్గారిథమ్‌ను అభివృద్ధి చేసినట్లు డా. జాన్సన్ వెల్లడించారు.
గత రెండేళ్లలో వివిధ దేశాల్లో జరిగిన దాడులకు ముందు ఉగ్రవాదుల మధ్య సాగిన సమాచార మార్పిడి.. సంభాషణలపై అధ్యయనం చేశారట. అలా గుర్తించిన వివరాల ప్రకారం భిన్నమైన అర్థాలతో ఉగ్రవాదుల సంభాషణలు ఉంటాయని.. సాధారణ పోస్టులతో పాటు అనుమానాస్పద పోస్టులను కూడా గుర్తించగలిగే అల్గారిథమ్‌ను రూపొందించినట్లు వివరించారు. సోషల్ మీడియాలో ఉగ్రవాదుల సంభాషనలు అధికారులు గుర్తించాలంటే ఎంతో ప్రయాస అవసరం. కానీ.. ఈ సాంకేతికతతో చాలా సులభంగా గుర్తించొచ్చని చెబుతున్నారు.
అయితే అకస్మాత్తుగా.. ముందస్తు వ్యూహం లేకుండా జరిగే ఉన్మాదుల దాడులను గుర్తించడం సాధ్యం కాదని చెప్పారు. ఈ కొత్త విధానానికి సంబంధించిన పూర్తి వివరాలను తాజాగా 'సైన్స్' జర్నల్‌లో ప్రచురించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







