అణ్వాయుధాలతో దాడి చేస్తామంటూ హెచ్చరించిన రష్యా అధ్యక్షుడు పుతిన్
- September 26, 2024
రష్యాపై ఇటీవల ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. రష్యాలోని మందుగుండు సామగ్రి డిపోపై ఉక్రెయిన్ ఈ దాడి చేసింది. దీంతో రష్యా మరింత అప్రమత్తమైంది. అంతేగాక, రష్యాపై ఉక్రెయిన్ నుంచి క్షిపణులతో దాడి జరగొచ్చంటూ తమ దేశ నిఘావర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ అత్యున్నత భద్రతా కౌన్సిల్ అధికారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పశ్చిమ దేశాలకు ‘న్యూక్లియర్ వార్నింగ్’ ఇచ్చారు. రష్యాపై క్రూయిజ్ క్షిపణులతో దాడి చేయడానికి ఉక్రెయిన్‌కు అమెరికా, యూకే సహా పశ్చిమ దేశాలు అనుమతిస్తే తాము అణ్వాయుధాలతో దాడి చేస్తామని పుతిన్ హెచ్చరించారు. యూకేకు చెందిన స్టార్మ్ షాడో క్రూయిజ్ క్షిపణిని రష్యాపై దాడి చేయడానికి వాడేలా యూకే గతవారం అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.
యూకే ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్ ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను కలవడానికి వాషింగ్టన్ డీసీకి కూడా వెళ్లారు. రష్యా భూభాగంపై ఉక్రెయిన్ నుంచి ఆయుధాలతో దాడి చేయడంపై కైర్ స్టార్మర్, జో బైడెన్ చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఇటీవల రష్యా నిఘా శాఖ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో యుద్ధం వేళ పశ్చిమ దేశాల జోక్యం మరింత పెరగడంతో తమ దేశ అణ్వాయుధ నియమ నిబంధనలను సవరించడం తప్పనిసరి అవుతోందని చెప్పింది.
తమ దేశ భూభాగంపై క్రూయిజ్ క్షిపణులతో దాడి చేయడానికి ఉక్రెయిన్‌కు అమెరికా, యూకే సహా పశ్చిమ దేశాలు అనుమతివ్వనున్నట్లు వస్తున్న ప్రచారంపై పుతిన్ స్పందిస్తూ.. ‘ఉక్రెయిన్‌కు ఇటువంటి అనుమతులను ఇస్తే పశ్చిమ దేశాలు నేరుగా రష్యాతో యుద్ధం చేస్తున్నట్లే. అటువంటిదే జరిగితే మేము అందుకు తగ్గ నిర్ణయాన్ని తీసుకుంటాం’ అని హెచ్చరించారు. ప్రపంచంలోని మొత్తం అణ్వాయుధాల్లో 88 శాతం రష్యా, అమెరికా వద్దే ఉన్నాయి.
తాజా వార్తలు
- ఆస్తుల పర్యాటక లీజు పై ప్రత్యేక కమిటీ..
- తెలంగాణ సత్తా ప్రపంచానికి చాటాం
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ







