‘రా మచ్చ రా..’ ‘గేమ్ ఛేంజర్’ అప్‌డేట్ వచ్చేసిందిరా.!
- September 26, 2024
‘క్రిస్‌మస్‌కి కలుద్దాం..’ అంటూ రామ్ చరణ్ వేసిన ట్వీట్‌తో అభిమానులు ‘గేమ్ ఛేంజర్’ సినిమా రిలీజ్‌పై ఓ క్లారిటీకి వచ్చేశారు. డిశంబర్‌లో సినిమా పక్కా అంటూ నమ్మకంతో ఎదురు చూస్తున్నారు.
అయితే, ఇంతవరకూ ఈ సినిమా అసలు రిలీజ్ డేట్ ఏంటనేది మాత్రం తెలిసి రావడం లేదు. అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించలేదింతవరకూ.
డిశంబర్ 20 లేదా 25లో ఈ సినిమా రిలీజ్ వుండొచ్చని అనుకుంటున్నారంతే. కొంతమంది రిలీజ్ వాయిదా పడే అవకాశాలున్నాయంటూ గాసిప్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే సెకండ్ సింగిల్ అంటూ ‘రా మచ్చ రా..’ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. దాంతో, ఏదో ఒక అప్డేట్ వచ్చిందిలే అని ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.
ఈ ఫస్ట్ సింగిల్‌ని ఈ నెల 28న రిలీజ్ చేయనున్నారన్నదే ఈ అప్డేట్ సారాంశం. అందుకోసం రిలీజ్ చేసిన పోస్టర్‌లో రామ్ చరణ్ క్లాస్ లుక్స్‌లో కనిపిస్తున్నాడు. కానీ పాట లిరిక్స్ చూస్తుంటే రా మచ్చ రా.. అంటూ మాస్ అప్పీల్ కనిపిస్తోంది.
బ్యాక్ గ్రౌండ్ ఏజ్ యూజ్‌వల్ శంకర్ స్టైల్ కలర్‌ఫుల్‌నెస్ కనిపిస్తోంది. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాటకు థమన్ మ్యూజిక్ అందించాడు. చూడాలి మరి, ఈ మాట క్లాస్ లెక్క.. మాస్ లెక్క ఏ పాటిదో.!
తాజా వార్తలు
- ఆస్తుల పర్యాటక లీజు పై ప్రత్యేక కమిటీ..
- తెలంగాణ సత్తా ప్రపంచానికి చాటాం
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ







