‘దేవర’ టికెట్ రేట్.! సామాన్యుడికి గుండె పోట్.!
- September 26, 2024
రేపు అనగా సెప్టెంబర్ 27న ‘దేవర’ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ అర్ధరాత్రి నుంచే స్పెషల్ ప్రీమియర్ షోలు పడనున్న సంగతి తెలిసిందే.
ఈ ప్రీమియర్ షోలకు సంబంధించి టికెట్ల రేట్లు ఎంతుండబోతున్నాయో చెప్పలేం కానీ, ఇది పూర్తిగా ఫ్యాన్స్ స్పెషల్ షోస్. ఎంతైనా రేటుండొచ్చు.
ఇక, రేపు అసలు సిసలు రిలీజ్ డేట్. ఈ రిలీజ్ కోసం సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ మీద 100 రూపాయలు పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది.
అయితే, సింగిల్ స్క్రీన్‌లో రేపు ఒక్కరోజు మాత్రమే పెరిగిన రేటుంటుంది. కానీ, మల్టీప్లెక్స్‌లో అయితే 10 రోజుల పాటు ఈ పెంచిన టికెట్ రేటు అమలులో వుండనుందట.
దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. సో, ఆ మొత్తాన్నీ రాబట్టాలంటే టికెట్ రేట్లుండాల్సిందే. ఇక, బాలీవుడ్లో ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయ్.
అలాగే ఓవర్సీస్లోనూ భారీగా బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ హైప్‌ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ హైప్ పెంచేయడం ఈ సినిమాకి గమనించదగ్గ అంశం. మరి, ఆ హైప్‌ని ‘దేవర’ అందుకుంటాడా.? లేదా.? తెలియాలంటే ఈ అర్ధరాత్రితో తెలిసిపోతుంది.
తాజా వార్తలు
- ఒమన్, భారత్ మధ్య కీలక అవగాహన ఒప్పందాలు..!!
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ







