డిశంబర్కి రంగం సిద్దం చేసుకుంటోన్న ‘తమ్ముడు’.!
- September 26, 2024
నితిన్ హీరోగా వస్తున్న చిత్రం ‘తమ్ముడు’. కేవలం తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి రిఫరెన్సులు మాత్రమే తీసుకునే నితిన్ ఈ సారి ఆయన సినిమా టైటిల్‌నే తన సినిమాకి పెట్టేసుకున్నాడు.
మరి, ఈ సినిమాపై అంచనాలు ఎలా వుంటాయ్. ఖచ్చితంగా ఆకాశాన్నంటేలానే వుంటాయ్. గురువు గారి పేరు నిలబెట్టాలిగా.
పవన్ కళ్యాణ్‌తో ‘వకీల్ సాబ్’ సినిమా తెరకెక్కించిన వేణు శ్రీరామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. నిజానికి ఈ సినిమాకి సంబంధించి ఇంతవరకూ ఎఫెక్టివ్ రేంజ్లో వచ్చిన ప్రోమోలేమీ లేవు.
కానీ, ఒక్క టైటిల్ చాలదా.? ఆ సంగతటుంచితే, ఈ సినిమాని డిశంబర్ రేస్‌లో దించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
డిశంబర్‌లో నిజానికి పెద్ద సినిమాలే వున్నాయ్. అంచనాలున్న సినిమాలు కూడా వున్నాయ్. అందులో ఒకటి ‘పుష్ప 2’ కాగా ఇంకోటి ‘గేమ్ ఛేంజర్’. అలాగే చైతూ నుంచి ‘తండేల్’ సినిమా కూడా ఇదే నెలలో రానుంది.
కానీ, వీటిలో ఏ ఒక్క సినిమా వెనక్కి తగ్గినా తమ సినిమాని రేస్‌లో దించేందుకు రెడీగా వున్నారట ‘తమ్ముడు’ అండ్ టీమ్. చూడాలి మరి ఏం జరుగుతుందో.!
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్