కార్తీ సినిమాకి పాజిటివ్ రిపోర్ట్ వచ్చేసిందిగా.!
- September 26, 2024
కొన్ని సినిమాలు కూల్ కూల్‌గా అలా అలా హాయిగా సాగిపోతుంటాయ్. ఎవ్వర్ గ్రీన్ సినిమాలుగా ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుంటాయ్.
అలాంటిదే కార్తి నటించిన ‘సత్యం సుందరం’ సినిమా అని తాజా రిపోర్ట్స్ వెల్లడి చేస్తున్నాయ్.
కార్తి నటించిన తాజా చిత్రం ‘సత్యం సుందరం’. ఈ సినిమా ఇంకా ధియేటర్లలో సందడి చేయలేదు. మరో రెండు రోజుల్లో అనగా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అయితే, చెన్నయ్‌లో ఆల్రెడీ వేసిన ప్రీమియర్ షోస్ ద్వారా వచ్చిన రిపోర్ట్స్ సినిమాకి పాజిటివ్ టాక్ తెచ్చి పెట్టాయ్.
గాల్లో ఎగిరెగిరి కత్తులు, గన్నులు పట్టి విలన్లపై విరుచుకుపడే హీరోని ఈ సినిమాలో ఎక్స్పెక్ట్ చేయలేం. అలాగే, హీరోయిన్‌తో కలిసి డీప్ రొమాంటిక్ సాంగ్స్ కూడా ఊహించకూడదు.
కానీ, ఏముంది.! ఈ సినిమాలో.. అంటే ఆహ్లాదమైన ఫీల్ వుంది. రెండున్నర గంటల పాటు ధియేటర్లో వీక్షించడానికి ఈ ఫీల్ అద్భుతంగా వుంటుంది.
అరవింద్ స్వామి కీలక పాత్రలో కనిపిస్తున్నాడు ఈ సినిమాలో. కార్తి తనదైన టైమింగ్ డైలాగులతో ఆకట్టుకుంటున్నాడు. హీరోయిన్ శ్రీ దివ్య నేచురల్ బ్యూటీగా ఆకట్టుకుంటోంది. అన్ని వర్గాల ప్రేక్షకులు తప్పకుండా చూసి ఆస్వాదించదగ్గ సినిమానే ‘సత్యం సుందరం ‘.!
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!