బ్లడ్ గ్రూప్ వెర్సస్ ఫుడ్ రిస్ట్రిక్షన్స్.! మీకీ సంగతి తెలుసా.?

- September 26, 2024 , by Maagulf
బ్లడ్ గ్రూప్ వెర్సస్ ఫుడ్ రిస్ట్రిక్షన్స్.! మీకీ సంగతి తెలుసా.?

ఈ మధ్య ఓ సర్వేలో గమ్మత్తయిన అంశం బయట పడింది. ఒక్కో బ్లడ్ గ్రూపు వారు కొన్ని రకాల ప్రత్యేకమైన ఆహారాల్ని తీసుకోవాలట.

బ్లడ్ గ్రూప్స్ అంటే ముఖ్యంగా ఏ, బీ, ఓ గ్రూపు వారు ఆయా ఆరోగ్య కారణాల రీత్యా కొన్ని ప్రత్యేకమైన ఆహారాల్ని తీసుకోవాలనీ, అలాగే కొన్ని కొన్ని ఆహార పదార్ధాలకు దూరంగా వుండాలని ఈ సర్వేలో తేలింది.

‘ఏ’ బ్లడ్ గ్రూపున్నవారికి ఇమ్యూనిటీ పవర్ మిగిలిన బ్లడ్ గ్రూప్ వాళ్లతో పోల్చితే కాస్త తక్కువగా వుంటుందట. అందుకే ఇమ్యూనిటీ ఎక్కువగా వుండే ఆహార పదార్ధాల్ని ఎక్కువగా తీసుకోవాలి. పండ్లు, ఆకుకూరలు, చేపలు, బీన్స్, మొలకెత్తిన గింజలు, ఉడికించిన గుడ్లు వంటి ఆహారాల్ని తమ డైట్‌లో ఖచ్చితంగా చేర్చుకోవాలి.

‘బి’ బ్లడ్ గ్రూప్ వున్నవారికి మెటబాలిజం తక్కువగా వుండే అవకాశాలున్నాయట. అందుకే కొలెస్ట్రాల్ తక్కువ వున్న ఆహార పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి. ఉడికించిన గుడ్లు, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. అలాగే టమాటా, నువ్వులు కలిసిన ఆహార పదార్ధాల్ని కాస్త  తక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

‘ఓ’ బ్లడ్ గ్రూప్ వున్నవారికి జీర్ణశక్తి బలహీనంగా వుండే అవకాశాలున్నయ్. అందుకే జీర్ణాశయ సమస్యలు ఎక్కువగా వుండే అవకాశాలున్నాయ్. రెగ్యులర్ ఫుడ్‌తో పాటూ, ఈజీగా జీర్ణమయ్యే ఆహారం మరియు ప్రొటీన్స్ ఎక్కువగా వుండే ఆహారం తమ డైట్‌లో వుండేలా చూసుకోవాలి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com