కువైట్ అంతటా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం..!!

- September 26, 2024 , by Maagulf
కువైట్ అంతటా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం..!!

కువైట్: GCX కంపెనీకి చెందిన అంతర్జాతీయ జలాంతర్గామి కేబుల్‌లో సమస్య కారణంగా ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. కువైట్ ప్రాదేశిక జలాల వెలుపలి ప్రాంతంలో అంతర్జాతీయ కేబుల్ పనిచేయకపోవడంతో ఇంటర్నెట్ సర్వీస్ క్రాస్ అయి, కువైట్ లో సేవలకు విఘాతం కలిగిందని కమ్యూనికేషన్స్ అథారిటీ తెలిపింది. కాగా, సమ్యలను సరిచేయడానికి సాంకేతిక ప్రక్రియలను ప్రారంభించినట్లు వెల్లడించింది. కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెగ్యులేటరీ అథారిటీ (CITRA) ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లతో కలిసి ప్రత్యామ్నాయ అంతర్జాతీయ కేబుల్స్ ద్వారా డేటా ట్రాఫిక్‌ను దారి మళ్లించడానికి పని చేస్తోందని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com