యూఏఈలో లైట్ వెయిట్ బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్.. రికార్డు స్థాయిలో కోనుగోళ్లు..!!

- September 26, 2024 , by Maagulf
యూఏఈలో లైట్ వెయిట్ బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్.. రికార్డు స్థాయిలో కోనుగోళ్లు..!!

యూఏఈ: దుబాయ్‌లో బంగారం ధరలు ఆల్‌టైమ్ హైస్‌కి చేరాయి. ఈ నేపథ్యంలో లైట్ వెయిట్ బంగారు ఆభరణాలకు డిమాండ్ ఇటీవల బాగా పెరిగింది. దాంతో యూఏఈలోని తయారీదారులు లైట్ వెయిట్ బంగారు ఆభరణాల తయారీని పెంచినట్టు తెలిపారు.  ముఖ్యంగా 15 గ్రాముల లోపు ఆభరణాలకు డిమాండ్ ఉందని దుకాణం దారులు చెబుతున్నారు. అయితే, బంగారం అధిక ధరలు అమ్మకాలపై ప్రభావం చూపాయని వారు పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా బంగారం ధరల ర్యాలీ నడుస్తుంది. బుధవారం సాయంత్రం దుబాయ్‌లో గ్రాముకు 322.75 Dh322.75 వద్ద ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. గ్రాముకు 22K, 21K మరియు 18K వరుసగా Dh298.75, Dh289.25 మరియు Dh248 వద్ద ట్రేడయ్యాయి. స్పాట్ బంగారం ఔన్స్‌కు 0.25 శాతం పెరిగి $2,664.68 వద్ద ఉంది. వడ్డీ రేట్ల తగ్గింపు, మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత, ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్‌లలోకి నిధుల ప్రవాహాల పునరుద్ధరణ అంచనాల నేపథ్యంలో ధరల ర్యాలీ నడుస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

“బంగారం ధరలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. నెల రోజుల క్రితం ఒక వస్తువును చూశామని, ఇప్పుడు దాని ధర 30 శాతం పెరిగిందని ప్రజలు అంటున్నారు. మేము దానిని నియంత్రించలేము. ధరల పెరుగుదల అమ్మకాలపై ప్రభావాన్ని చూపాయి. అందకే లైట్ వెయిట్ బంగారు  అభరణాలకు డిమాండ్ పెరిగింది.”అని జవరా జ్యువెలరీ చైర్మన్ తౌఫిక్ అబ్దుల్లా అన్నారు.  జోయాలుక్కాస్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ జాన్ పాల్ అలుక్కాస్ మాట్లాడుతూ.. ఇటీవల యూఏఈలో తేలికపాటి బంగారు ఆభరణాలకు డిమాండ్ గణనీయంగా పెరిగిందని అన్నారు.   అధిక డిమాండ్ కారణంగా, తయారీదారులు తేలికైన ఆభరణాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారని అలుక్కాస్ పేర్కొంది. 5 నుండి 15 గ్రాముల శ్రేణిలో అభరణాలకు అధిక డిమాండ్ కనిపిస్తోందని  మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అంతర్జాతీయ కార్యకలాపాలకు మేనేజింగ్ డైరెక్టర్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ షామ్‌లాల్ అహమ్మద్ తెలిపారు.      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com