డాక్టర్‌ కోసం ఆన్‌లైన్‌ అపాయింట్‌మెంట్‌

- June 20, 2016 , by Maagulf
డాక్టర్‌ కోసం ఆన్‌లైన్‌ అపాయింట్‌మెంట్‌



మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌, ఆన్‌లైన్‌ (ఇ-బుకింగ్‌) సర్వీస్‌ని ప్రారంభించింది. ముహర్రాక్‌ పరిధిలోగల హెల్త్‌ సెంటర్స్‌లోని ఏ ఫిజీషియన్‌ అపాయింట్‌మెంట్‌ అయినా ఆన్‌లైన్‌ ద్వారా తేలిగ్గా దొరికేందుకు ఆస్కారం ఏర్పడింది. 80007000 నెంబర్‌కి ఫోన్‌ చేసి ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్‌ పొందవచ్చు. పౌరులు మరియు నివాసితులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా ముందస్తుగా అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేసుకోవడం, అవసరం లేనప్పుడు క్యాన్సిల్‌ చేసుకోవడం, అలాగే ఎంతమంది పెండింగ్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకుని ఉన్నారనే విషయాల్ని తెలుసుకునే వీలుంది. వారం రోజుల అపాయింట్‌మెంట్‌ని వినియోగదారులు యాక్సెస్‌ చేయొచ్చు. ఒక స్పెషాలిటీ కోసం ఒక అపాయింట్‌మెంట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అపాయింట్‌మెంట్‌ సమయానికి రెండు గంటల ముందు మాత్రమే రీషెడ్యూల్‌ చేసుకోవడానికి వీలుంటుంది. అపాయింట్‌మెంట్‌ పొందినవారు ఆ సమయానికి 20 నిమిషాల ముందుగా క్లినిక్‌లో హాజరవ్వాల్సి ఉంటుంది. ఈ 20 నిమిషాల సమయంలో అవసరమైన డాక్యుమెంట్లు సబ్‌మిట్‌ చేయడానికి వీలుంటుంది. ఒకవేళ అపాయింట్‌మెంట్‌ తీసుకుని, సమయానికి క్లినిక్‌కి వెళ్ళకపోతే, ఆ స్లాట్‌ని ఇంకొకరికి కేటాయిస్తారు. వరుసగా మూడు అపాయింట్‌మెంట్లను ఓ వ్యక్తి క్యాన్సిల్‌ చేసుకుంటే, నెల రోజులపాటు ఆన్‌లైన్‌ బుకింగ్‌ నుంచి ఆ వ్యక్తిని తొలగిస్తా

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com