వదిలేసిన ట్యాంకర్ల తరలింపు
- June 20, 2016
పార్కింగ్ లాట్స్‌లో వదిలేసిన 120 ట్యాంకర్లను అబుదాబీ మునిసిపాలిటీ, తరలించింది. డౌన్‌టౌన్ అబుదాబీ నుంచి 40 కిలోమీటర్ల దూరంలోని బనియాస్ ఈస్టర్న్ సెక్టార్స్ వరకు నిర్లక్ష్యంగా వదిలేసిన ట్యాంకర్లపై కొరడా ఝుళిపిస్తున్నారు. ముందస్తుగా వాహనాల్ని తరలించాల్సిందిగా ట్యాంకర్ యజమానులకు సమాచారం ఇచ్చినా, స్పందించకపోవడంతో మునిసిపాలిటీ ఈ ట్యాంకర్లను అక్కడినుంచి తరలించింది. ఇందుకుగాను 3,000 దిర్హామ్‌లు జరిమానా కూడా విధించింది మునిసిపాలిటీ. జరీమానా చెల్లించనిదే ట్యాంకర్ల వద్దకు వెళ్ళేందుకు యజమానులకు అనుమతి లేదు. ఈ జరీమానాకి అదనంగా, ట్యాంకర్లను తరలించి నిలిపివేసినందుకు, తరలించడానికి అయ్యే ఖర్చుల్ని సైతం వసూలు చేయనునన్నారు. 2012 లా నెంబర్ 2 ప్రకారం, నిబంధనల్ని ఉల్లంఘించినవారికి రి-కాన్సిలేషన్ అలాగే 50 శాతం జరీమానాలో డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. పదే పదే ఈ నిబంధనల ఉల్లంఘన కొనసాగేవారికి జరీమానా రెట్టింపు కానుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







