వదిలేసిన ట్యాంకర్ల తరలింపు

- June 20, 2016 , by Maagulf
వదిలేసిన ట్యాంకర్ల తరలింపు



పార్కింగ్‌ లాట్స్‌లో వదిలేసిన 120 ట్యాంకర్లను అబుదాబీ మునిసిపాలిటీ, తరలించింది. డౌన్‌టౌన్‌ అబుదాబీ నుంచి 40 కిలోమీటర్ల దూరంలోని బనియాస్‌ ఈస్టర్న్‌ సెక్టార్స్‌ వరకు నిర్లక్ష్యంగా వదిలేసిన ట్యాంకర్లపై కొరడా ఝుళిపిస్తున్నారు. ముందస్తుగా వాహనాల్ని తరలించాల్సిందిగా ట్యాంకర్‌ యజమానులకు సమాచారం ఇచ్చినా, స్పందించకపోవడంతో మునిసిపాలిటీ ఈ ట్యాంకర్లను అక్కడినుంచి తరలించింది. ఇందుకుగాను 3,000 దిర్హామ్‌లు జరిమానా కూడా విధించింది మునిసిపాలిటీ. జరీమానా చెల్లించనిదే ట్యాంకర్ల వద్దకు వెళ్ళేందుకు యజమానులకు అనుమతి లేదు. ఈ జరీమానాకి అదనంగా, ట్యాంకర్లను తరలించి నిలిపివేసినందుకు, తరలించడానికి అయ్యే ఖర్చుల్ని సైతం వసూలు చేయనునన్నారు. 2012 లా నెంబర్‌ 2 ప్రకారం, నిబంధనల్ని ఉల్లంఘించినవారికి రి-కాన్సిలేషన్‌ అలాగే 50 శాతం జరీమానాలో డిస్కౌంట్‌ పొందే అవకాశం ఉంది. పదే పదే ఈ నిబంధనల ఉల్లంఘన కొనసాగేవారికి జరీమానా రెట్టింపు కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com