ఒమన్‌లో 1.1% పెరిగిన ద్రవ్యోల్బణం రేటు.. ఏయే ధరలు పెరిగాయంటే?
- September 29, 2024
మస్కట్: నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ జారీ చేసిన సుల్తానేట్‌లోని కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా ప్రకారం.. ఒమన్ సుల్తానేట్‌లో ద్రవ్యోల్బణం రేటు 2023లో అదే కాలంతో పోలిస్తే 2024 ఆగస్టులో 1.1 శాతం పెరిగింది.వివిధ వస్తువుల ధరలు 4.4 శాతం, ఫుడ్- మద్య పానీయాలు 3.3 శాతం, హెల్త్ 2.4 శాతం, హౌసింగ్, నీరు, విద్యుత్, గ్యాస్, ఇతర ఇంధనాలు 1.7 శాతం, సంస్కృతి -వినోదం 0.7 శాతం, రెస్టారెంట్లు -హోటళ్లు 0.4 శాతం, దుస్తులు -పాదరక్షలు 0.3 శాతం ధరలు పెరిగాయని డేటా పేర్కొంది.
కూరగాయల ధరలు 11.5 శాతం, పండ్లు 7.4 శాతం, పాలు, చీజ్ -గుడ్లు 5.4 శాతం, మాంసం 2.8 శాతం, చక్కెర, జామ్, తేనె - స్వీట్లు 2.3 శాతం, ఆహారం ఉత్పత్తులు 1.9 శాతం, నూనెలు - కొవ్వులు 1.2 శాతం, ఆల్కహాల్ లేని పానీయాలు 1.1 శాతం, బ్రెడ్ - తృణధాన్యాలు 1 శాతం, చేపలు -మత్స్య ధరలు 4.1 శాతం తగ్గాయని పేర్కొంది. అదే సమయంలో రవాణా సమూహాల ధరలు 2.7 శాతం తగ్గాయని, ఫర్నిచర్, గృహోపకరణాలు - సాధారణ గృహ నిర్వహణ 0.6 శాతం, విద్య 0.4 శాతం, పొగాకు -కమ్యూనికేషన్ సమూహాల ధరలు స్థిరంగా ఉన్నాయని తెలిపింది.
ముసందమ్ గవర్నరేట్ ఆగస్టు 2024 చివరి నాటికి అత్యధిక ద్రవ్యోల్బణ రేటును నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇండెక్స్ 2.3 శాతం పెరిగింది. సౌత్ అల్ షర్కియా గవర్నరేట్‌లో 2.2 శాతం పెరిగింది. అల్ వుస్తాలో 2 శాతం, నార్త్ అల్ షర్కియా గవర్నరేట్‌లు, నార్త్ అల్ బతినా, అల్ బురైమి గవర్నరేట్‌లలో రేటు 1.6 శాతం పెరిగగా.. ధోఫర్ గవర్నరేట్‌లో 1.3 శాతం, అల్ దహిరా , ల్ దఖిలియా గవర్నరేట్‌లలో 1 శాతం, మస్కట్ గవర్నరేట్‌లో 0.8, దక్షిణ అల్ బతినా గవర్నరేట్‌లో 0.7 శాతం పెరిగిందని వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







