మాదకద్రవ్యాల అక్రమ రవాణా నిరోధం.. సౌదీ, జోర్డాన్ ఒప్పందం..!!

- September 29, 2024 , by Maagulf
మాదకద్రవ్యాల అక్రమ రవాణా నిరోధం.. సౌదీ, జోర్డాన్ ఒప్పందం..!!

రియాద్: సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ గురువారం రియాద్‌లోని మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో జోర్డాన్ కౌంటర్ మాజిన్ అబ్దుల్లా అల్-ఫర్రేహ్‌ను స్వాగతించారు. ఈ భేటీలో ఇరు దేశాల మంత్రిత్వ శాఖల మధ్య భద్రతా సహకారాన్ని మరింత పెంపొందించే మార్గాలపై చర్చించారు. ఉమ్మడి ఆసక్తి ఉన్న అనేక అంశాలను కూడా వారు సమీక్షించారు. మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాల  స్మగ్లింగ్‌ ను  ఎదుర్కోవడంలో సౌదీ అరేబియా - జోర్డాన్ ప్రభుత్వాల మధ్య కుదిరిన సహకార ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇదు దేశాలకు చెందిన సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com