ఫుజైరాలో అక్రమంగా వేట.. నేరస్థుల కోసం వేట..!!
- October 01, 2024
యూఏఈ: ఫుజైరాలోని ఓ పర్వత ప్రాంతంలో అడవి జంతువుల కోసం ట్రాపింగ్ పరికరాలను ఉపయోగిస్తున్నట్లు ఆన్‌లైన్‌లో ఓ వీడియో వైరల్ కావడంతో.. ఫుజైరా పర్యావరణ అధికార బృందాలు రంగంలోకి దిగాయి. ఫుజైరా ఎన్విరాన్‌మెంటల్ అథారిటీకి చెందిన బయోడైవర్సిటీ బృందం వైరల్ వీడియోలో చూపించిన ప్రదేశాన్ని గుర్తించారు. ప్రత్యేక బృందాలు వెంటనే వేటకు ఉపయోగించిన అన్ని పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. పర్యావరణానికి హాని కలిగించే చట్టవిరుద్ధమైన చర్యల కారణంగా ఈ చర్యకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కసరత్తు సాగుతున్నట్లు అధికార యంత్రాంగం తెలిపింది. ఏదైనా సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ - 800368కి నివేదించాలని అథారిటీ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







