గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024.. మెరిసిన ఒమన్..!!

- October 01, 2024 , by Maagulf
గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024.. మెరిసిన ఒమన్..!!

మస్కట్: 133 దేశాలలో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024లో ఒమన్ సుల్తానేట్ 74వ స్థానంలో నిలిచింది. "హ్యూమన్ క్యాపిటల్ అండ్ రీసెర్చ్" , "ఇన్‌ఫ్రాస్ట్రక్చర్" సూచికలలో ఒమన్ మెరుగైన పనితీరును కనబరిచింది. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ జారీ చేసిన ఈ నివేదికలో సుల్తానేట్ ఆఫ్ ఒమన్ 59వ ఇన్నోవేషన్ ఇన్‌పుట్ ర్యాంక్‌ (6 ర్యాంక్‌లు మెరుగు)లో నిలిచింది. 3 ఉప సూచికలలో అగ్ర 20 దేశాలలో ఒమన్ కూడా స్థానం పొందింది. "వ్యాపారం చేయడం కోసం పాలసీ స్థిరత్వం" సబ్-ఇండికేటర్‌లో ఒమన్ 12వ స్థానంలో.. "సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్స్" సబ్-ఇండికేటర్‌లో 2వ స్థానంలో ఉంది. అదే సమయంలో “విద్యుత్ ఉత్పత్తి” ఉప సూచికలో ఒమన్ ప్రపంచవ్యాప్తంగా 16వ స్థానంలో నిలిచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com