యూఏఈ రాయబారి నివాసంపై దాడి..తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా..!!
- October 01, 2024
రియాద్: సూడాన్‌లోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) రాయబారి నివాసంపై జరిగిన దాడిని సౌదీ అరేబియా ఖండించింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. దౌత్య సంబంధాలపై వియన్నా కన్వెన్షన్‌కు అనుగుణంగా దౌత్యవేత్తల రక్షణ, దౌత్య మిషన్ల ప్రాంగణాలకు గౌరవం కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లోని దౌత్యాధికారి నివాసానికి భారీ నష్టం వాటిల్లిందని తెలిపింది. "విదేశాంగ మంత్రిత్వ శాఖ ... సుడానీస్ సాయుధ దళాల ఈ దాడికి వ్యతిరేకంగా లీగ్ ఆఫ్ అరబ్ స్టేట్స్, ఆఫ్రికన్ యూనియన్, ఐక్యరాజ్యసమితికి నిరసన లేఖను సమర్పిస్తుంది. ఇది దౌత్య ప్రాంగణాల ఉల్లంఘన కిందకు వస్తుంది, ”అని ప్రకటనలో సౌదీ అరేబియా పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు
- తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..
- ఇండిగో రద్దుల పై ప్రధాని మోదీ స్పందన
- కువైట్ వెదర్ అలెర్ట్..భారీ వర్షాలు..!!







