సిట్ విచారణను తాత్కాలికంగా నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం
- October 01, 2024
అమరావతి: తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి అంశంపై ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమల రావు ప్రకటించారు. ఈ లడ్డూ వ్యవహారంపై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు చేసిన సూచన మేరకు లడ్డూ కల్తీపై ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు డీజీపీ వెల్లడించారు. తదుపరి విచారణ అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా విచారణ కొనసాగిస్తామన్నారు.
కాగా, గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎన్‌డీడీబీ తన నివేదికలో స్పష్టం చేసింది. దీంతో శ్రీవారి భక్తులు, హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన నిజనిజాలు నిగ్గుతేల్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. రెండు రోజులుగా సీట్ అధికారులు బృందాలుగా ఏర్పడి లడ్డు కల్తీ ఫై దర్యాప్తు చేపట్టారు. సుప్రీంకోర్టులో తదుపరి విచారణ (అక్టోబరు 3) అనంతరం, అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా సిట్ విచారణ మళ్లీ కొనసాగుతుందని డీజీపీ వివరించారు.
తాజా వార్తలు
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..
- ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీకి ‘Z’ కేటగిరీ భద్రత
- భారత్ టారిఫ్‌ల పై ట్రంప్‌కు అమెరికాలోనే వ్యతిరేకత
- ఏపీ: 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
- భారత్ కు చేరుకున్న ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ
- గడువు ముగిసిన పదార్థాలు.. రెస్టారెంట్ యజమానికి జైలుశిక్ష..!!
- ఖతార్ లో కొత్త తరం వాహన లైసెన్స్ ప్లేట్లు..!!
- వాతావరణ ప్రమాదాలు, సునామీపై జాతీయ అవగాహన..!!







