ఖాతార్ లో సూపర్ సింగర్స్ సింగింగ్ కాంపిటీషన్ సీజన్ 2 ప్రారంభం
- October 01, 2024
దొహా: సింగర్స్ కావాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త. దోహా మ్యూజిక్ లవర్స్ సూపర్ సింగర్ సింగింగ్ కాంపిటీషన్... తాజాగా ప్రారంభమైంది. దోహా మ్యూజిక్ లవర్స్, అమౌంట్ ఎడిషన్ డాన్స్ స్టూడియో తో కలిసి... సూపర్ సింగర్ సింగింగ్ కాంపిటీషన్ సీజన్ 2 ప్రారంభమైంది. భవిష్యత్తు సింగర్స్ ను...తయారు చేసేందుకు ఈ కాంపిటీషన్ ప్రారంభించినట్లు ప్రతినిధులు ప్రకటించారు.
ఈవెంట్ ప్రత్యేకతలు
ఇక ఈ సూపర్ సింగర్ కాంపిటీషన్ ఖాతార్ లో నిర్వహించనున్నారు.ఈ ఈవెంట్ లో .. వయసుతో సంబంధం లేకుండా... ఏ వయసు వారైనా పాల్గొనవచ్చు.టాలెంట్ ఉన్న వారు ఎవరైనా... ఈ ఈవెంట్ కు వచ్చి.. టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని.. ఈవెంట్ ప్రతినిధులు ప్రకటించారు. పాప్, మెలోడీ, క్లాసికల్, రాక్ ఇలా ఏ రకాలైన సరే... సంస్కృతిక స్టైల్ లో పాటలు పాడిన సరే అందరూ.. ఈ ఈవెంట్ లో పాల్గొనవచ్చు అని ప్రకటించారు.
లాంచ్ గురించి మాట్లాడుతూ, "మా కమ్యూనిటీలోని గాయకుల కోసం ఈ అద్భుతమైన అవకాశాన్ని సృష్టించడానికి ఎమోట్ ఎడిషన్ డ్యాన్స్ స్టూడియోతో భాగస్వామిగా ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాము. సంగీతంపై ప్రేమను పెంపొందించడం మరియు అందించడం మా లక్ష్యం. వర్ధమాన తారలు తమ టాలెంట్‌ని ప్రదర్శించడానికి ఒక వేదిక, అదే సమయంలో పాడటం పట్ల వారికి ఉన్న అభిరుచి ద్వారా ప్రజలను ఏకం చేస్తుంది."అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు.సెంట్రల్ ఇండియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జై ప్రకాష్, ఫిలిప్పీన్స్‌కి చెందిన సింగర్ రీనా, సుప్రసిద్ధ పంజాబీ గాయకుడు మోహిందర్ జలంధరి, ప్రఖ్యాత పాకిస్థానీ గాయకుడు జావేద్ బజ్వా, భారతదేశానికి చెందిన సారా అలీఖాన్ గాయని, నూర్ అఫ్సాన్, బంగ్లాదేశ్‌కు చెందిన రోనీ గాయకుడు, నేపాల్ నుండి మనీష్ గాయకుడు, భారతదేశం నుండి ప్రతిభావంతులైన గాయకుడు బాసిత్, సన్నీ, అస్లాం, రవి, రఘు, శ్రావ్య వుడీ మరియు ఇతరులు పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!