లండన్‌లో అగ్నిప్రమాదం..తెలుగు యువకుడు మృతి
- February 25, 2026
లండన్: లండన్‌లో (UK) అగ్నిప్రమాదం.. తెలుగు యువకుడు మృతి కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణం కొండయ్యపేటకు చెందిన అభిషేక్ (28) ఉన్నత చదువుల కోసం మూడేళ్ల క్రితం లండన్ వెళ్లాడు. అక్కడ ఎంబీఏ (MBA) పూర్తి చేసిన అనంతరం, అక్కడే ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం సంపాదించి స్థిరపడ్డాడు. చేతికి అందిన కొడుకు విదేశాల్లో మంచి ఉద్యోగం చేస్తూ తమను ఆదుకుంటాడని భావించిన ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది.
లండన్‌లో జరిగిన ఒక భారీ అగ్నిప్రమాదంలో అభిషేక్ చిక్కుకుపోయినట్లు ఈ ప్రమాదంలో అతను ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. అయితే, ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఒక్కగానొక్క కొడుకు మరణ వార్త విన్న పెద్దాపురంలోని అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







