బ్రస్సెల్స్ లో మరోసారి బాంబు బెదిరింపు ..
- June 21, 2016
బ్రస్సెల్స్ లో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. పోలీసులు ఓ అనుమానిత ఉగ్రవాదిని అరెస్టు చేశారు. అతడు బెల్ట్ బాంబు ధరించి ఉన్నట్లు సమాచారం. బ్రస్సెల్స్ నడిబొడ్డున ఓ అతిపెద్ద షాపింగ్ మాల్ వద్ద ఇతడిని అరెస్టు చేసినట్లు బ్రస్సెల్స్ మీడియా వెల్లడించింది.ఓ పక్క గతంలో జరిగిన దాడులకు సంబంధించి ఇప్పటికే ముమ్మరంగా ఉగ్రవాదులను ఏరిపారేసే చర్యల్లో నిమగ్నమైన పోలీసులకు సిటీ 2 అనే ఓ రిటెయిల్ షాపింగ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి తారసపడ్డాడు. అతడిని ఎంతో చాకచక్యంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పదుల సంఖ్యలో పోలీసులు తిరుగుతున్నా ఓ ఉగ్రవాది బయటకు రావడం ఎక్కడో బాంబుదాడి జరగవచ్చనే అనుమానానికి తావిస్తోందని, ఈ విషయాన్ని అంత తేలికగా తీసుకోకూడదని బ్రసెల్స్ ప్రధాని చార్లెస్ మైఖెల్ చెప్పారు.
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







