రాందేవ్ బాబా మరో మెగా ప్రాజెక్ట్...
- June 21, 2016
యోగా గురు రాందేవ్ బాబా మరో మెగా ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే పతంజలి గ్రూప్ పేరుతో విజయవంతమైన ఆయన.. ఇప్పుడు అతిపెద్ద యోగా ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. హర్యానాలోని ఫరీదాబాద్ సమీపంలో ఉన్న కోట్ అనే గ్రామంలో వెయ్యి ఎకరాల్లో ఈ యోగా ఇన్స్టిట్యూట్ నెలకొల్పబోతున్నట్లు సమాచారం. దీనిపై రామ్‌దేవ్ బాబా ప్రతినిధిని ప్రశ్నించగా.. అంత తొందరెందుకు, ఆయనే దీనిపై ప్రకటన చేస్తారని చెప్పారు. మంగళవారం యోగా డే సందర్భంగా ఫరీదాబాద్‌లో లక్షల మందితో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంతో ఏడు ప్రపంచ రికార్డులను సృష్టించబోతున్నామని నిర్వాహకులు తమ ఆహ్వానంలో వెల్లడించారు.
యోగా ఇన్స్టిట్యూట్పై గతంలోనే రాందేవ్ బాబా తన మనసులో మాట బయటపెట్టారు. హర్యానాలో జరిగిన ఓ ఈవెంట్లో మాట్లాడుతూ 5 వేల కోట్లతో ఓ భారీ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు అప్పట్లో ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







