షేక్ జాయెద్ రోడ్‌లో యాక్సిడెంట్.. 4.2 కి.మీ పొడవున ట్రాఫిక్ జామ్..!!
- October 05, 2024
దుబాయ్: షేక్ జాయెద్ రోడ్‌లో పలు కార్లు ఢీకొనడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 4కిమీ కంటే ఎక్కువగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. లాస్ట్ ఎగ్జిట్ DXB బౌండ్ సమీపంలో జరిగిన ప్రమాదంలో "కనీసం 5-6 కార్లు" ఒకేసారి ఢీకొన్నట్లు పలువురు తమ సోషల్ మీడియా అకౌంట్లలో వెల్లడించారు.
దుబాయ్ పార్క్స్, రిసార్ట్స్ సమీపంలో అదే మార్గంలో మరో చిన్న ప్రమాదం కూడా నమోదైంది. ట్రాఫిక్ మ్యాప్ సైతం ట్రాఫిక్ నెమ్మదిగా క్లియర్ అవ్వడాన్ని చూపింది. 9-నిమిషాల ఆలస్యం 5-నిమిషాల హోల్డ్-అప్‌గా చూపించింది. నగరంలోని ఆర్టీరియల్ రోడ్డుపై వెళ్లే వాహనదారులు ట్రాఫిక్ జామ్‌ను నివారించడానికి ప్రత్యామ్నాయ రహదారులను ఉపయోగించాలని ట్రాఫిక్ అధికారులు సూచించారు.
ట్రాఫిక్ నియమాలు
దుబాయ్‌లో వాహనదారులందరికీ రోడ్లు సురక్షితంగా ఉండేలా కఠినమైన నియమాలు అమల్లో ఉన్నాయి.నిబంధనలు పాటించని వారిపై భారీ జరిమానాలు విధించబడతాయి. ఉదాహరణకు, ఎమిరేట్‌లో తీవ్రమైన ట్రాఫిక్ ప్రమాదానికి కారణమైతే 23 బ్లాక్ పాయింట్ల పెనాల్టీ, 30-రోజుల వాహనాన్ని జప్తు చేయడంతో కోర్టు ఆదేశించిన జరిమానా విధించబడుతుంది.
తాజా వార్తలు
- యూఏఈలో ఆన్లైన్ ట్రేడింగ్ స్కామ్‌లకు బలవుతున్న ఇన్వెస్టర్లు..!!
- ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. తీవ్రంగా ఖండించిన ఒమన్..!!
- సార్ కారు ప్రమాదం.. మూడుకు చెరిన మృతుల సంఖ్య..!!
- స్పెషల్ ఆపరేషన్.. ఖైతాన్‌లో 20 మంది ప్రవాసులు అరెస్టు..!!
- యూఏఈ ఉద్దేశపూర్వకంగా 3 నౌకలను ఎందుకు ముంచివేసిందంటే..!!
- సౌదీ అరేబియాలో 2,400 మందికి పైగా స్మగ్లర్లు అరెస్టు..!!
- ఈ కార్ రేసు కేసులో కెటిఆర్ కు ఎసిబి పిలుపు
- మొబైల్ వినియోగదారులకి టెలికాం శాఖ గుడ్ న్యూస్
- హైదరాబాద్ లో రెచ్చిపోతున్న రాజస్థాన్ దొంగలు
- ఇరాన్‌పై ఇజ్రాయెల్ వార్..ముడి చమురు ధరలకు రెక్కలు!