సౌదీయేతరులతోనే 64.8% సౌదీల వివాహాలు..అధ్యయనం వెల్లడి..!!

- October 05, 2024 , by Maagulf
సౌదీయేతరులతోనే 64.8% సౌదీల వివాహాలు..అధ్యయనం వెల్లడి..!!

రియాద్: సౌదీ అరేబియాలోని నేషనల్ సెంటర్ ఫర్ సోషల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ కీలక అధ్యయన నివేదికను విడుదల చేసింది. సౌదీయేతరులను వివాహం చేసుకోవడం పట్ల సౌదీ పౌరుల వైఖరిని పరిశీలిస్తూ ఇటీవలి అధ్యయనాన్ని నిర్వహించారు. సౌదీలు తమ సామాజిక నేపథ్యానికి దూరంగా ఉండే వారిని జీవిత భాగస్వాములను ఎంచుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని సర్వే పేర్కొంది. సౌదీలు విదేశీయులను వివాహం చేసుకునే వారి శాతం 64.8%గా అంచనా వేశారు. ఇమామ్ ముహమ్మద్ బిన్ సౌద్ విశ్వవిద్యాలయం నుండి డాక్టర్ మొహమ్మద్ అల్-టౌమ్ నేతృత్వంలోని అధ్యయనం సాగింది. ఈ నిర్ణయాన్ని ప్రభావితం చేసే అనేక అంశాలను వెల్లడించారు. భార్యాభర్తల మధ్య బంధుత్వం లేకపోవడం, వయస్సు పెరగడం, జీవిత సంరక్షణ అవసరం పెరగడం వంటివి ముఖ్యమైన కారణాలుగా తేల్చింది.  

పెరుగుతున్న జాతీయాంతర వివాహాల సంఖ్య సౌదీ కుటుంబాల సామాజిక, సాంస్కృతిక ఫాబ్రిక్‌లో చెప్పుకోదగ్గ మార్పులకు దారితీయవచ్చని అధ్యయనం తెలిపింది. విదేశీ జీవిత భాగస్వాములు తీసుకువచ్చే కొత్త ఆచారాలు, సంప్రదాయాలు స్థానిక సంస్కృతులపై ప్రభావితం చేయగలవని అభిప్రాయపడింది.   ఈ పరిశోధనలకు మద్దతుగా జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ 2020 నివేదికలో 4,502 వివాహ ఒప్పందాలు ఒక సౌదీయేతర జీవిత భాగస్వామిని కలిగి ఉన్నాయని పేర్కొంది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com