దోహాలో రెండు కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత..!!

- October 05, 2024 , by Maagulf
దోహాలో రెండు కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత..!!

దోహా: హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు వెళ్లే కీలక రహదారుల్లో తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నట్లు ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) ప్రకటించింది. రెండు కీలక రహదారుల్లో పాక్షిక మూసివేతలను ప్రకటించింది. సి-రింగ్ రోడ్ నుండి రాస్ బు అన్నౌద్ స్ట్రీట్ వైపు ఎడమవైపు ట్రాఫిక్ కోసం షార్క్ ఇంటర్‌సెక్షన్ వద్ద తాత్కాలిక పాక్షిక మూసివేత అమలు చేయనున్నట్లు పేర్కొంది. ఇది అక్టోబర్ 6 ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. అలాగే, అల్-అసిరి కూడలికి వెళ్లే మెసాయిద్ రోడ్ నుండి అండర్ పాస్ ఎగ్జిట్ రోడ్డు కూడా పాక్షికంగా మూసివేయబడుతుందని పేర్కొంది. వాహనదారులు ప్రత్యామ్నాయ రహదారులను ఉపయోగించాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com