విద్యార్థుల నుంచి లంచం..టీచర్‌కు మూడేళ్ల జైలు, 5,000 దిర్హామ్‌ల జరిమానా..!!
- October 05, 2024యూఏఈ: తన పాఠశాలలో విద్యార్థుల నుండి లంచం కోరినందుకు దోషిగా నిర్ధారించిన తరువాత ఒక బ్రిటీష్ టీచర్ కు మూడు సంవత్సరాల జైలు శిక్ష, Dh5,000 జరిమానా విధించారు. ఈ మేరకు అబుదాబి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఉత్తర్వులు జారీ చేసింది. శిక్షను అనుసరించి టీచర్ ను యూఏఈ నుండి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. పరీక్షా ఫలితాలను మార్చేందుకు, విద్యార్థుల గ్రేడ్‌లను పెంచడానికి బదులుగా లంచం తీసుకున్నట్లు టీచర్ పై ఆరోపణలు వచ్చాయి. పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణ ప్రారంభించిన తర్వాత కేసు వెలుగులోకి వచ్చింది. ఇది టీచర్ దుష్ప్రవర్తనకు రుజువుని వెల్లడించింది. ప్రస్తుతం, ఫెడరల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ పరీక్షా విధానాన్ని మోసం చేయడం, అంతరాయం కలిగించడం వంటి అనేక కేసులను దర్యాప్తు చేస్తోంది.
తాజా వార్తలు
- పాకిస్తాన్: రైల్లో బాంబు పేలుడు..20 మంది దుర్మరణం
- షార్జా ఎడారిలో మోటర్‌బైక్ బోల్తా..వ్యక్తిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- దుబాయ్ రైడ్.. కీలక రహదారులల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. !!
- యాదాద్రి పేరు మార్పు,టీటీడీ తరహాలో టెంపుల్ బోర్డు...
- వాహనదారులు అలెర్ట్.. పోలీసు కెమెరాల నిఘాలో దుబాయ్ రోడ్లు..!!
- ఐలా బ్యాంక్.. రెండు జ్యువెలరీ ప్రచారాలు ప్రారంభం..!!
- ఉత్తర రియాద్‌లో భూమి లావాదేవీలపై పరిమితులు ఎత్తివేత..!!
- నవంబర్ 10న దుబాయ్ మెట్రో సమయాలు పొడిగింపు..!!
- కొత్త తరహా దోపిడీ…అప్రమత్తం అంటున్న తెలంగాణ పోలీస్
- యూఏఈలోని ప్రవాస గృహయజమానులు మీ ఆస్తిని ఇలా సురక్షితం చేసుకోండి