ముంబైలో అగ్ని ప్రమాదం-ఐదుగురు దుర్మరణం
- October 06, 2024
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఏడుగురు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.
పోలీసుల కథనం ప్రకారం..ముంబైలోని చెంబూర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చలరేగాయి.ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మంటలు వ్యాపించిన సమయంలో ఆ కుటుంబం నిద్రలో ఉండడంతో తప్పించుకోలేకపోయారు.
అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నించారు. బాధితులను రాజావాడి ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందారని అధికారులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!







