ఎంత ఎదిగినా మన మూలాలు, సంస్కృతి, సాంప్రదాయలను మరవొద్దు: మంత్రి జూపల్లి
- October 06, 2024
దుబాయ్: మన విశిష్ఠ సంస్కృతే మన ప్రత్యేక గుర్తింపు అని,ఎంత ఎదిగినా మన మూలాలు, సంస్కృతి, సాంప్రదాయలను మరవొద్దని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.రెండు రోజుల దుబాయ్ పర్యాటనలో భాగంగా పర్యాటక అభివృద్ధి, ప్రమోషన్ వంటి అంశాలపై ఓ హోటల్ లో పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దుబాయ్ పర్యాటక శాఖ అధికారి జాసిం మొహమద్ అల్ అవాదీ, ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ తో కలిస పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.
ఆ దేశ పురోగతి, ఆర్థికాభివృద్ధిలో ఈ పర్యాటక కేంద్రాల పాత్రను మంత్రి జూపల్లి కృష్ణారావు అడిగి తెలుసుకున్నారు.మన రాష్ట్రంలోని పలు పర్యాటక కేంద్రాల అభివృద్ధి, తద్వారా వచ్చే ఆదాయం, ఉపాధి అవకాశాల కల్పన ఎలా సాధించాలనే కోణంలో దుబాయ్ లో అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ...నేటి శాస్త్ర, సాంకేతిక యుగంలో మన సంస్కృతి సంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థలు ద్వంసం కావడం వల్ల సమాజంలో చాలా రుగ్మతలకు దారితీస్తుందని, వాటి విలువను బావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.మన సంపదను పదిమంది మంచికి ఉపయోగించాలని సూచించారు.
బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతాయని,బతుకమ్మ పండుగ మహిళ శక్తిని చాటుతుందని,తెలంగాణ ఉద్యమాన్ని సంఘటిత శక్తిగా మార్చడంలో బతుకమ్మ వేడుకలు ప్రత్యేక పాత్ర పోషించాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







