విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు..
- October 06, 2024
అమెరికా: ఘోర ప్రమాదం తప్పింది. విమానం ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. దట్టమైన పొగలు కమ్ముకోవటంతో అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను అదపు చేశారు. విమానాశ్రయం సిబ్బంది, ఫైర్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. విమానంలో మొత్తం 190మంది ప్రయాణికులు ఏడుగురు సిబ్బంది ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కాలిఫోర్నియాలోని శాన్ డియాగో నుంచి లాస్ వెగాస్ కు ఫ్రాంటియర్ ఎయిర్ లైన్స్ విమానం వెళ్తుంది. అయితే, విమానం హ్యారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. చుట్టూ దట్టమైన పొగ వ్యాపించింది. చూస్తుండగానే మంటలు పెద్దవి అవుతున్న క్రమంలో విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తమయ్యారు.. ఫైరిజన్లు వేగంగా విమానం వద్దకు తీసుకెళ్లి మంటలను అదుపు చేశారు. అనంతరం ప్రయాణికులను సురక్షితంగా విమానంలో నుంచి కిందికి తీసుకొచ్చి బస్సులో టెర్మినల్ కు తరలించారు. పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులతోపాటు విమానాశ్రయ ఉన్నతాధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలాఉంటే.. విమానం ల్యాండింగ్ సమయంలో మంటలు చెలరేగడంపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) విచారణ చేపట్టింది.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







