సూపర్ స్టార్ సినిమా ఎటువంటి హైప్ లేకుండానా.?
- October 07, 2024
తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ నుంచి ఏ సినిమా వచ్చినా రిలీజ్‌కి ముందు ఆ సినిమా సృష్టించే అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. కానీ, ఈ మధ్య సూపర్ స్టార్ సినిమాలు అలాంటి వండర్స్ క్రియేట్ చేయడం లేదు.
గత ఏడాది ‘జైలర్’ సినిమాతో రజనీకాంత్ ప్రేక్షకుల్ని అలరించారు. ఈ సినిమాకి రిలీజ్ ముందర అంచనాలు లేకపోవడంతో రిలీజ్ తర్వాత ఓకే అనిపించింది. అయితే, ధియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని ‘జైలర్’ ఓటీటీలో ఒకింత బెటర్ అనిపించుకుంది.
ఈ సినిమా తర్వాత రజనీకాంత్ నుంచి వస్తున్న సినిమానే ‘వెట్టియాన్’. సూర్యతో ‘జైభీమ్’ వంటి సందేశాత్మక చిత్రం తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు టి.జె.జ్ఞాన్వేల్ ఈ సినిమాకి దర్శకుడు.
వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించాడు. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రజనీకాంత్‌తో సహా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ నటులు నటించడం సినిమాకి అదనపు ఆకర్షణ.
అంతేకాదు, ఫహాద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ వంటి విలక్షణ నటీ నటులు నటిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
అలాగే, రజనీకాంత్‌కి బాగా కలిసొచ్చిన బ్యానర్ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని ప్రతిష్టాత్మ కంగా నిర్మిస్తుండడం విశేషం. రిలీజ్‌కి ముందు పెద్దగా అంచనాలు క్రియేట్ చేయలేదు కాబట్టి, సినిమా రిలీజ్ తర్వాత ఆకట్టుకుంటుందేమో చూడాలి మరి. అలాగే, దసరా సీజన్లో రిలీజ్ అవుతోన్న సినిమా కావడంతో ఏమాత్రం మంచి టాక్ వచ్చినా కలెక్షన్ల సునామీనే.!
తాజా వార్తలు
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర







