‘యూఏఈ విత్ యూ లెబనాన్'.. రిలీఫ్ క్యాంపెయిన్ అక్టోబర్ 8న ప్రారంభం..!!
- October 07, 2024
యూఏఈ: "యూఏఈ విత్ యూ లెబనాన్" ఉపశమన ప్రచారం అక్టోబర్ 8న ప్రారంభమవుతుంది. ఇది ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో అక్టోబర్ 21 సోమవారం వరకు కొనసాగుతుంది. లెబనీస్ కు మద్దతు ఇవ్వడానికి యూఏఈ అధ్యక్షుడు $100 మిలియన్ విలువైన అత్యవసర సహాయ సహాయ ప్యాకేజీని ప్రకటించారు. సుమారు 205 టన్నుల వైద్య, ఆహారం, సహాయ సామాగ్రి మరియు షెల్టర్ పరికరాలతో 6 విమానాలను పంపనున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (UNICEF), యునైటెడ్ నేషన్స్ హై కమీషనర్ ఫర్ రెఫ్యూజీస్, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ మరియు క్రెసెంట్ సొసైటీస్ వంటి భాగస్వాములతో కలిసి బాధితులకు అందజేస్తారు.ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ ఆదేశాల మేరకు ఉప ప్రధాన మంత్రి, అధ్యక్ష వ్యవహారాల మంత్రి షేక్ థియాబ్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, డిప్యూటీ షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఫాలోఅప్‌లో ‘యూఏఈ విత్ మీ లెబనాన్' ప్రచారం ప్రారంభించనున్నారు.
తాజా వార్తలు
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర







