మహిళా పాలసీపై ప్రభుత్వం దృష్టి ..
- June 21, 2016
15ఏళ్ల తరువాత జాతీయ మహిళా పాలసీపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ పాలసీ మార్పులకు..చేర్పులకు సమాయత్తం అవుతోంది. అంతేగాకుండా ఈ పాలసీకి సూచనలు..సలహాలు..అందించాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో మానవి 'వేదిక'లో ఈ అంశంపై చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో హైమావతి (ఐద్వా), కల్పన (యాక్షన్ ఏయిడ్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తిస్తాయిలో మహిళల ప్రాథమిక హక్కులకు రక్షణ లేదు. సాంఘీక భద్రతకు మరింత ప్రాధాన్యతనివ్వాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విధానపరమైన నిర్ణయాల్లో మార్పులు అవసరమని, హింసకు వ్యతిరేకంగా మరిన్ని రక్షణ చర్యలు అవసరమని పలువురు పేర్కొంటున్నారు. విద్య, వైద్యం విషయంలో అనేక అంశాలు చేర్చాలని, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు మరిన్ని అవకాశాలు కల్పించాలని సూచనలు వస్తున్నాయి.హింసకు వ్యతిరేకంగా మరిన్ని రక్షణ చర్యలు అవసరమని, మహిళల ఉద్యోగ కల్పనకు మరిన్ని మెరుగైన అవకాశాలు కావాలన్నారు. పాలసీలో మార్పులు స్పష్టంగా చేర్చాలని, పాలసీని మరింత సమగ్రంగా రూపొందించాలని సూచించారు. మరి వక్తలు ఈ పాలసీపై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారు ?
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







