ఢిల్లీలో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు పర్యటన ..

- October 08, 2024 , by Maagulf
ఢిల్లీలో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు పర్యటన ..

న్యూఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. తన షెడ్యూల్‌లో భాగంగా నేడు పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. ఉదయం 11:30 గంటలకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4.30కు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమవుతారు. అనంతరం 5:45 గంటలకు కేంద్ర పెట్రోలియం సహజ వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ కానున్నారు.

ఇక రాత్రి 8 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. రాత్రి 11:15 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో చంద్రబాబు సమావేశమవుతారు. వరద సాయం, రాజధాని అమరావతి అవుటర్ రింగ్ రోడ్, జాతీయ రహదారుల అభివృద్ధి, విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం,రాష్ట్రంలో పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు, బడ్జెట్లో ప్రకటించిన పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి గురించి ఈ సందర్భంగా కేంద్రమంత్రులతో చర్చించి నిధుల విడుదల గురించి ప్రస్తావించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com