అఫ్ఘానిస్తాన్ లో తాలిబన్లు 27 మంది ప్రయాణికులును కిడ్నాప్..
- June 21, 2016
అఫ్ఘానిస్తాన్ లో తాలిబన్లు కనీసం 27 మంది ప్రయాణికులును కిడ్నాప్ చేశారు. మంగళవారం దక్షిణాది ప్రావిన్స్ హెల్మాండ్ లో కాబూల్-హెరాత్ హైవేపై వెళ్తున్న మూడు వాహనాలను సాయుధ తాలిబన్ ఉగ్రవాదులు అడ్డగించారు. రెండు ట్రక్ లు, ఓ బస్సులో ప్రయాణిస్తున్నవారిని తాలిబన్లు బందీలుగా చేసుకుని, సమీపంలోని గ్రామాల్లోకి తీసుకెళ్లినట్టు భద్రత దళాల వర్గాలు వెల్లడించాయి.బందీలను విడిపించడం కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్టు హెల్మాండ్ ప్రావిన్స్ పోలీస్ చీఫ్ అఖా నూర్ కెంటోజ్ తెలిపారు. కాగా 27 మంది ప్రయాణికులను విచారణ కోసం తీసుకెళ్లినట్టు తాలిబన్ ప్రతినిధి ఖారి యూసుఫ్ అహ్మది వెల్లడించాడు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







