సోహర్ ఎయిర్పోర్ట్కి విమానాల రద్దు
- June 21, 2016
సోహార్ ఎయిర్పోర్ట్కి ఒమన్ ఎయిర్ విమాన సర్వీసుల్ని రద్దు చేయడం నార్త్ మరియు సౌత్ బతినా నివాసితులకు షాక్ కలిగించింది. అయితే మస్కట్ ఎయిర్పోర్ట్ నుండి సోహార్ ఎయిర్పోర్ట్కి విమానాలు నడపడం ఆర్థికంగా ఏమాత్రం ఉపయోగకరంగా లేదని ఒమన్ ఎయిర్ వర్గాలు తెలిపాయి. 5 శాతం ఆక్యుపెన్సీ కూడా లేకపోవడంతో విమాన సర్వీసుల్ని రద్దు చేశామని వెల్లడించింది ఒమన్ ఎయిర్. ఒమన్ షురా కౌన్సిల్ లీగల్ కమిటీ హెడ్ మొహమ్మద్ అల్ జద్జాలి ఈ నిర్ణయాన్ని తప్పు పట్టారు. ఎయిర్పోర్ట్ నిర్మాణ సమయంలో ఎనకమిక్ ఫీజబులిటీని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. 63 మిలియన్ రియాల్స్ ఖర్చుతో ఈ ఎయిర్పోర్ట్ని నిర్మించారు. అలాగే 36 మిలియన్ రియాల్స్, మూడో ఫేజ్ నిర్మాణం కోసం వెచ్చించనున్నారు. ఈ పరిస్థితుల్లో విమానాల రద్దు మంచిది కాదని, ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అల్ జద్జాలి కోరారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







